తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎంత శాతం తగ్గింది.?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పన్నులు, పన్నేతర ఆదాయంతో పాటు కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అంచనాల్లో 40 శాతం కంటే తక్కువ నమోదైంది.


ఈ ఏడాది పన్నుల రాబడి అంచనా రూ. 1,02,026 కోట్లు కాగా ఇప్పటివరకు రూ. 38,530 కోట్లు మాత్రమే వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు వరకు ఆదాయ, వ్యయాలపై రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు నివేదికను అందచేసింది. రెవెన్యూ రాబడులు 32.3 శాతంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది

Follow Us @