తొలి దేశీయ స్టెల్త్ యుద్ధనౌక ‘హిమగిరి’ ని త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ సతీమణి మధులిక రావత్ డిసెంబర్ 14న పూజలు చేసి పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నదిలోకి జలప్రవేశం చేయించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని జీఆర్ఎస్ఈ(గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్) యార్డ్‌లో P17A ప్రాజెక్టు కింద యుద్ధనౌక తయారు చేశారు.