భారత దేశంలో మొత్తం 16,671 పోలీస్స్టేషన్లలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న టాప్-10 పోలీసు స్టేషన్లలో మణిపుర్‌కు తొలిస్థానం దక్కింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట టౌన్ పదోస్థానంలో నిలిచింది.
ఉత్తమ పనితీరుతోపాటు ఫిర్యాదుదారులకు మెరుగైన సేవలు, నేరాల నిరోధానికి సత్వర చర్యలు, మహిళలకు సంబంధించిన కేసులపై ప్రత్యేక దృష్టి వంటి అంశాలకుగానూ వీటిని ఎంపిక చేశారు.