BIKKI NEWS : తెలంగాణ రాష్ట్రంలో అనేక జలపాతాలు నదులు, వాగులు, చెరువుల మీద ఏర్పడి ఉన్నాయి… ముఖ్యమైన జలపాతాలు వాటి వివరాలు…
★ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా :
1) సప్తగుండాల జలపాతం సిర్పూర్ అర్బన్ మండలంలో మెరమ్ వాగుపై కలదు.
2) సమితుల గుండాల జలపాతం (మోవడ్, అసిఫాబాద్ మండలం)
3) పిట్టగూడ జలపాతం, మిట్టె జలపాతం (లింగపూర్ మండలంలో కలవు)
★ జయశంకర్ భూపాలపల్లి & ములుగు జిల్లాలు
1) బొగత జలపాతం : వాజేడు మండలం (ములుగు జిల్లా) చీకుపల్లి గ్రామం లో కలదు. దీనినే తెలంగాణ నయాగరగా పిలుస్తారు.
2) చింతామణి జలపాతం
3) గద్దల సరి జలపాతం (ములుగు జిల్లా): గద్దలు ఎగిరేంత ఎత్తులో ఉండటంతో స్థానిక గిరిజనులు దీనిని గద్దల సరి జలపాతంగా పిలుస్తారు
★ ఆదిలాబాద్ జిల్లా :
బోధ్ నియోజకవర్గంలోని పొచ్చెర, కుంటాల, గాయత్రి, కనకాయి జలపాతాలు కలవు.
1) పొచ్చెర జలపాతం : వేరడిగండ మండలంలోని పొచ్చెర్ల గ్రామ సమీపంలో చిన్నకొండవాగు రాళ్లపై ఈ జలపాతం గలదు.
2) కుంతల జలపాతం (నేరడిగండ మండలం) : రాష్ట్రంలోని ఎత్తైన జలపాతం. గోదావరికి ఉపనదియైన కడెం వాగు సహ్యాద్రి పర్వత పంక్తులపై 45 మీటర్ల ఎత్తు నుంచి దూకుతూ కనువిందు చేస్తుంది. జలపాతం దూకే చోట చిన్న రాతి గుహ ఉంది. అందులో సోమేశ్వరుడు, నంది తదితర విగ్రహాలున్నాయి.
3) గాయత్రి జలపాతం : ఇచ్చోడ మండలంలో అడవిలోగలదు. ఈ జలపాతాన్ని ఇక్కడివారు గాడిద గండం అంటారు.
4) కవకాయి/కనకదుర్గా జలపాతం : బజార్ హట్నూరు మండలంలో గిర్నార్ గ్రామానికి ఒక కి.మీ. దూరంలో గలదు.
★ నాగర్ కర్నూలు జిల్లా :
1) మల్లెల తీర్థం జలపాతం:
నల్లమల అడవుల్లో ఉన్నది. ఈ జలపాతాన్ని వల్లమల ఊటీగా పిలుస్తారు
★ మహబూబాబాద్ జిల్లా :
1) బీమునిపాద జలపాతం : గూడూరు మండలంలో కలదు
★ మంచిర్యాల జిల్లా :
1) గుండాల జలపాతం: హజీపూర్ మండలం రాళ్లవాగు పై కలదు.
★ సంగారెడ్డి జిల్లా :
1) జాడి మల్కాపూర్ జలపాతం. మొగుదంపల్లి మండలంలో గొట్టగుట్ట ప్రాంతంలో కలదు.
★ పెద్దపల్లి జిల్లా :
సబితం, రాముని గుండాలు, రాఘవపూర్ జలపాతాలు కలవు.
- CURRENT AFFAIRS IN TELUGU 20th NOVEMBER 2024
- IDBI BANK JOBS – 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్
- CDAC JOBS – సీడాక్ లో 265 కాంట్రాక్టు ఉద్యోగాలు
- MAHA LAXMI SCHEME- మహిళలకు ₹2,500/- ఎప్పుడంటే.?
- ISRAEL – బెంజమిన్ నెతన్యాహూ పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్