TET EXAM 2023 : త్వరలోనే టెట్

హైదరాబాద్ (జూలై – 07) : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖపై ఈరోజు విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో సమీక్ష నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ డీఎస్సీ కంటే ముందు మరొకసారి టెట్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే గతేడాది జూన్ 12న విద్యాశాఖ టెట్ నిర్వహించింది.

తెలంగాణలో టీచర్ల ఖాళీల భర్తీ ప్రక్రియను టెట్ పరీక్ష నిర్వహించిన తర్వాత ఫలితాలు విడుదల చేసి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అలాగే ఈరోజు సమీక్షలలో మన ఊరు-మన బడిపై చర్చించింది. టీచర్ పోస్టంల భర్తీ పైన నిర్ణయం తీసుకున్నారు. పలు అంశాలపై చర్చించడానికి మరొకసారి భేటీ కానున్నారు.