తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్‌స్ట్రాక్ట్ – 2022 (PART – 1)

BIKKI NEWS : తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత స్థితిగతుల పట్ల తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్‌స్ట్రాక్ట్ – 2022 నివేదిక తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది పోటీ పరీక్షల నేపథ్యంలో ఇందులోని సమాచారాన్ని వివిధ పార్ట్ లుగా సంక్షిప్తంగా మీకోసం

◆ తెలంగాణ జనాభాపరంగా భారతదేశంలో 12వ స్థానంలో, వైశాల్యపరంగా 11 వ స్థానంలో ఉంది.

◆ 79% గోదావరి, 69% కృష్ణానదుల క్యాచ్ మెంట్ ఏరియాలో ఈ రాష్ట్రం ఉంది.

◆ 33 జిల్లాలు, 74 రెవిన్యూ డివిజన్లు, 612 రెవిన్యూ మండలాలు, 10,909 రెవిన్యూ గ్రామాలు రాష్ట్రంలో కలవు.

◆ 12,769 గ్రామ పంచాయతీలు, 129 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్ లు రాష్ట్రంలో కలవు.

◆ 119 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంటు స్థానాలు రాష్ట్రంలో కలవు.

◆ తెలంగాణ రాష్ట్రంలో 2021లో నూతన జోనల్ విధానాన్ని అమలుపరిచారు. దీని ప్రకారం రాష్ట్రం ఏడు జోన్లుగా విభజించబడింది అవి… బాసర, భద్రాద్రి, కాళేశ్వరం, రాజన్న, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ…

◆ బాసర, భద్రాద్రి, కాళేశ్వరం, రాజన్న ఈ నాలుగు జోన్లను కలిపి మల్టీజోన్ – 1 గా, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ ఈ మూడు జోన్లను కలిపి మల్టీజోన్ – 2 గా విభజించారు..

◆ తెలంగాణలో సాధారణ వార్షిక వర్షపాతం 906 మి.మీ.

◆ తెలంగాణలో జనసాంద్రత 312, స్త్రీ – పురుష నిష్పత్తి 988, అక్షరాస్యత శాతం 66.54% గా ఉంది.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @