ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఆర్‌. లింబ్రాది

హైదరాబాద్ (జూన్ – 26) : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఆర్‌ లింబ్రాదిని నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం ఆయన ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. గత ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి పదవీ కాలం ముగిసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. మరో వైపు ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌గా ఎస్‌కే మహమూద్‌ను నియామకమయ్యారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ బోటనీ ప్రొఫెసర్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు