తెలంగాణ బడ్జెట్ – 2022 కేటాయింపులు pdf file

తెలంగాణ బడ్జెట్ 2022 ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు శాసన సభలో ప్రవేశ పెట్టారు. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనతికాలంలోనే దేశంలో కెల్లా అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చింది. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో స్వరాష్ట్ర స్వప్పం సాకారమైంది’ అని హరీశ్ రావు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ₹ రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

బడ్జెట్ పూర్తి పాఠం pdf

 • రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల కోట్లు
 • క్యాపిటల్ వ్యయం రూ.29,728 కోట్లు
 • దళిత బంధుకు రూ.17,700 కోట్లు
 • పల్లె ప్రగతి ప్రణాళికకు రూ. 330 కోట్లు
 • పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1,394 కోట్లు
 • కొత్త వైద్య కళాశాలలకు రూ. వెయ్యి కోట్లు..
 • 2022-23 నాటికి మొత్తం అప్పులు 3,29,998 కోట్లు. జీఎస్టీపీలో 25 శాతం.
 • పంట రుణాలు రూ. 16,144 కోట్లు మాఫీ..
 • సొంత స్థలం ఉన్న 4 లక్షల మందికి రూ. 3 లక్షల చొప్పున సాయం.
 • అమ్మకం పన్ను అంచనా 33,000 కోట్లు. ఎక్సైజ్ ద్వారా
 • రాష్ట్రంలో పామాయిల్ సాగుకు ప్రోత్సాహం. పామాయిల్ సాగుకు రూ.వెయ్యి కోట్లు.
 • రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం.
 • సొంత స్థలంలో 2 పడకల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం.
 • ఆర్ధిక ఆదాయం 17,500 కోట్లు.
 • స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం 15,600 కోట్లు,
 • అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు
 • మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, నారాయణ పేట, గద్వాల, యాదాద్రిలో వైద్య కళాశాలలు
 • కేంద్రం రాష్ట్రం పట్ల చిన్న చూపు చూస్తోంది.
 • మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు అడిగినా కేంద్రం ఇవ్వలేదు.
 • రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ
 • వచ్చే ఆర్థిక ఏడాది రూ. 75 వేల లోపు సాగు రుణాలు
 • రాష్ట్రంలో పన్ను ఆదాయం 1,08,211.98 కోట్లు.
 • కేంద్ర పన్నుల్లో వాటా 18,394.11 కోట్లు.
 • పన్నేతర ఆదాయం 25,421.63 కోట్లు.
 • గ్రాంట్లు 41,001.73 కోట్లు.
 • రుణాలు 53,970 కోట్లు
Follow Us @