హైదరాబాద్ (జూలై – 23) : తెలంగాణ రాష్ట్రంలో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల కోసం 40,926 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ని ఆగస్టు 2న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హల్ టికెట్లను (telangana staff nurse jobs hall tickets link) అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.
కింద ఇవ్వబడిన లింక్ ద్వారా అభ్యర్థులు హల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అలాగే ఆన్లైన్ పద్దతిలో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు సంబంధించిన ఆన్లైన్ మాక్ టెస్ట్ ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు (TS MHSRB) అవకాశం కల్పించింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా మాక్ టెస్ట్ ను ప్రాక్టీసు చేయవచ్చు.
మొదటిసారి ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల అవగాహన కోసం వెబ్సైట్ లో మాక్ టెస్ట్ రాయవచ్చని తెలిపింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ కేంద్రాలుగా ప్రధాన పరీక్ష జరగనుంది.
◆ వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm