STAFF NURSE JOBS : పరీక్షకు కఠిన నిబంధనలు

హైదరాబాద్ (జూలై – 31) : మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆగస్ట్ 2న నిర్వహిస్తున్న స్టాఫ్ నర్స్ ఉద్యోగ పరీక్షకు (staff nurse job) కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

మొత్తం 40,936 మందికి 40 కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో 24, ఖమ్మంలో 6, నిజామాబాద్;లో 2, వరంగల్ లో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల సమాచారాన్ని బయోమెట్రిక్ పద్ధతిలో సేకరిస్తారు. కాబట్టి ముందస్తుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి

ఒకే రోజు మూడు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం సెషన్ పరీక్ష 9 గంటలకు ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు 7.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 8.45 గంటలకు గేట్ మూసేస్తారు. రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం అవుతుంది. 11 గంటలకే చేరుకోవాలి. 12.15 గంటలకు గేట్ మూసేస్తారు. ఇక మూడో సెషన్ పరీక్ష సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుంది. దీనికి హాజరయ్యే అభ్యర్థులు మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్రానికి చేరుకోవాలి. 3.45 గంటలకు గేట్ మూసేస్తారు.

★ అభ్యర్థులకు సూచనలు

అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ ను ఏ-4 సైజు పేపర్ నై ప్రింటవుట్ తీసుకోవాలి.

అభ్యర్థి ఫొటో, సంతకం స్పష్టంగా ఉంటేనే హాల్ టికెట్ చెల్లుబాటు అవుతుంది.

హాల్ టికెట్, ఫొటో లేకుండా లేదా సంతకం లేకుండాళఉంటే అభ్యర్థి 3 పాస్పోర్ట్ సైజు ఫొటోలను తప్పనిసరిగా గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన ఒక హామీతో పాటు తీసుకురావాలి . పరీక్ష హాల్లోని ఇన్విజిలేటరు అందజేయాలి. లేని పక్షంలో అభ్యర్థిని పరీక్షకు అనుమతించరు.

అభ్యర్థులు పాస్పోర్ట్/పాన్ కార్డ్/ఓటర్ ఐడీ/ఆధార్ కార్డ్/ ప్రభుత్వ ఉద్యోగి ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్లలో
ఏదో ఒక చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలి.

రిజిస్ట్రేషన్ వద్ద అభ్యర్థుల బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరిస్తారు. కాబట్టి అభ్యర్థులు తమ చేతులపై మెహందీ, ఇంక్, టాటూలు వంటివి వేయించుకోవద్దు.

గేట్ మూసివేసే సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు.

అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రం, సెషన్ లో మాత్రమే పరీక్ష రాయాలి. పరీక్షా కేంద్రం, సెషన్ మార్పు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.

అభ్యర్థి పరీక్షా కేంద్రం లోపలకు హాల్ టికెట్, నలుపు/నీలం బాల్ పాయింట్ పెన్, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు మాత్రమే తీసుకెళ్లాలి.

పారదర్శకమైన వాటర్ బాటిల్ తీసుకురావచ్చు. పరీక్ష హాలులో రఫ్ షీట్లను ఇన్విజిలేటర్ అందజేస్తారు.

అభ్యర్థులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే, అనర్హత వేటు వేయడమే కాకుండా సంబంధిత పోలీస్ స్టేషన్
ఎఫ్ఎఆర్ నమోదు చేస్తారు.

అభ్యర్థులు కాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు, టాబ్స్, పెన్ డ్రైవ్లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్, లాగ్ టేబుల్స్, వాలెట్, హ్యాండ్ బ్యాగ్లు, రైటింగ్ ప్యాడ్లు, నోట్స్, చార్టు, లూజ్ షీట్లు లేదా మరే ఇతర గాడ్జెట్లను తీసుకురావడానికి అనుమతి లేదు. అలాగే ఇతర రికార్డింగ్ సాధనాలను అనుమతించరు.

అభ్యర్థి చెప్పులు మాత్రమే ధరించి పరీక్షా కేంద్రానికి రావాలి. బూట్లు ధరించకూడదు. నిర్ణీత సమయానికి ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రం నుంచి బయటకు పంపడానికి అనుమతించరు.