తెలంగాణ పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్రం 2020 -21 విద్యా సంవత్సరానికి గాను పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ ను పాఠశాల విద్యా శాఖ ఈ రోజు విడుదల చేసింది మే 17వ తారీకు నుంచి మే 26వ తారీకు వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే పరీక్ష సమయం ఉదయం 9.30 నుండి మధ్యహ్నం 12.45 వరకు నిర్ణయించారు. గతంలో కంటే 30 నిమిషాలు పరీక్ష సమయం పెంచారు.

కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం ఎక్కువ శాతం ఆన్లైన్ తరగతులు జరగడం వలన 2020 – 21 విద్యా సంవత్సరానికి SSC బోర్డు పరీక్షలను 11 పేపర్ లకు బదులు ఆరు పేపర్లకు కుదిస్తూ పాఠశాల విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది.

★ పరీక్షల షెడ్యూల్ ::

మే – 17 – 2021 :: FIRST LANGUAGE

మే – 18 – 2021 :: SECOND LANGUAGE

మే – 19 – 2021 :: ఇంగ్లీష్

మే – 20 – 2021 :: మ్యాథమెటిక్స్

మే – 21 – 2021 :: జనరల్ సైన్స్ (పిజికల్ సైన్స్ & బయాలజీకల్ సైన్స్)

మే – 22 – 2021 :: సోషల్ స్టడీస్

మే – 24 – 2021 :: OSSC Main language paper – I

మే – 25 – 2021 :: OSSC Main language paper – II

మే – 26 – 2021 :: SSC VOCATIONAL COURSE (theory)

Follow Us@