విద్యా సంస్థల ప్రారంభం పై 11న నిర్ణయం.

ఈ నెల 11న ఉద‌యం 11:30 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రులు, క‌లెక్ట‌ర్ల‌తో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

రెవెన్యూ, పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్, వైద్యారోగ్య, విద్యా, అట‌వీశాఖ‌‌ల‌పై స‌మీక్షించ‌నున్నారు. వీటితో పాటు ముఖ్య‌మైన అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు.

రాష్ట్రంలో విద్యా సంస్థల్లో తరగతులను ఎప్పటి నుండి తిరిగి ప్రారంభించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఏ తరగతి నుండి క్లాసులు నిర్వహించాలి, ఏ విధంగా నిర్వహించాలి, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానం ఏమిటి, తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

Follow Us@