Registration Charges – త్వరలోనే భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపు – నూతన విలువలు

BIKKI NEWS (JUNE 15) : Telangana registration charges hike very soon. తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయోతర భూముల రిజిస్ట్రేషన్ విలువలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించిన ఫైళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్లు సమాచారం.

Telangana registration charges hike very soon.

అయితే భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచిన ప్రజలపై భారం పడకుండా స్టాంప్ డ్యూటీని అరశాతం తగ్గించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

మొదటగా హెచ్ఎండిఏ పరిధిలోని భూములకు మాత్రమే నూతన రిజిస్ట్రేషన్ చార్జీలను అమలు చేసి, తర్వాత గ్రామీణ ప్రాంతాలకు కూడా వర్తింపజేయాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

గత ఏడాదే రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు అమలు కావలసి ఉండగా రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో ఉండడంతో ఆ ఆలోచనను ప్రభుత్వం మానుకుంది.

భూముల విలువ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో చార్జీలు భారీగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వ్యవసాయ భూముల ఎకరం కనీస విలువ 4 లక్షలుగా నిర్ణయించాలని, మొత్తం మూడు కేటగిరీలో ఈ విలువను సవరించి హైవేల పక్కన ఉండే వ్యవసాయ భూముల ధరను 40 – 50 లక్షలు వరకు పెంచాలని ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.

వ్యవసాయోతర భూముల విలువను 20 నుంచి 100% మేర పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం.

నూతన రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు అంచనా HMDA పరిధిలో

OPEN PLOTS REGISTRATION CHARGES

29,100 – 37,400 మద్య ఉన్న చార్జీలను 40,000 – 50,000 వరకు పెంచే అవకాశం ఉంది.

APARTMENT PLOTS REGISTRATION CHARGES

2,500 – 4,500 మద్య ఉన్న చార్జీలను 3,500 – 5,000 మద్య పెంచే అవకాశం ఉంది.

HOME REGISTRATION CHARGES

29,100 – 37,400 మద్య ఉన్న చార్జీలను 40,00 – 50,000 మద్య పెంచే అవకాశం ఉంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు