TS POLICE JOBS UPDATES : తొలుత ఎస్సై ఫలితాలు

హైదరాబాద్ (జూలై – 05) : తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSPLRB) పోలీస్ ఉద్యోగాల నియామకాల తుది ఎంపిక కోసం తీవ్ర కసరత్తును ప్రారంభించింది. ఇటీవల పూర్తయిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు 97,175 మంది అభ్యర్థులు హజరయ్యారు.

ఈ 97,175 మంది నుంచి కటాఫ్ మార్కులు ఆధారంగా ఎస్సై, ఎఎస్సై, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఎస్సై పోస్టులను మల్టీ జోన్లు ఆధారంగా… కానిస్టేబుల్ పోస్టులను జిల్లా ఆధారంగా కట్ ఆఫ్ మార్కులను నిర్ణయించనున్నారు. అలాగే సామాజిక వర్గాల రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు వంటి 180 కి పైగా పారామీటర్లను పరిగణలోకి తీసుకొని కట్ ఆఫ్ మార్కులను నిర్ణయించనున్నారు.

జూలై రెండో వారంలో మొదటగా ఎస్సై ఏఎస్ఐ ఫలితాలను విడుదల చేయడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. 579 ఎస్ఐ పోస్టులు, 8 ఏఎస్ఐ పోస్టుల కు కట్ ఆఫ్ మార్కులను నిర్ణయించి ప్రకటించనున్నారు. ఎస్సై, ఏఎస్ఐ పోస్టులకు అర్హత సాధించిన వారు కానిస్టేబుల్ కు కూడా ఎంపిక అయితే ఆ పోస్టును వదులుకునేలా అండర్ టేకింగ్ తీసుకోనున్నారు

అభ్యర్థుల నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నియామక పత్రాలను అందజేయనున్నారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో స్పెషల్ బ్రాంచ్ లు పనిచేయనున్నాయి. అభ్యర్థుల తాత్కాలిక, శాశ్వత చిరునామాల్లో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నివేదికను బోర్డుకి పంపనున్నారు. ఈ నివేదికలో క్లీన్ చీట్ ఉంటేనే నియామక పత్రం అందజేయనున్నారు.