హైదరాబాద్ (ఎప్రిల్ – 24) : తెలంగాణలో కానిస్టేబుల్ తుది రాత పరీక్షల హాల్ టికెట్లును TSLPRB అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు హల్ టికెట్లను ఎప్రిల్ 28 అర్ధరాత్రి 12.00 గంటల లోపు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.
పోలీస్ కానిస్టేబుల్ (సివిల్, ఐటీ అండ్ సీవో) తుది పరీక్షలు ఎప్రిల్ 30న జరగనున్నాయి.
సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉదయం10.00 గం. నుంచి మధ్యాహ్నం 1.00 వరకు జరగనుంది.
ఐటీ అండ్ సీవో పోస్టులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గం. వరకు నిర్వహిస్తారు.
అభ్యర్దులు తమ మొబైల్ నెంబర్ మరియు పాస్వర్డ్ లను కింద ఇవ్వబడిన లింకులో ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.