TS POLICE RESULTS : ఎస్ఐ‌, కానిస్టేబుల్ తుది కీ, ఫలితాలు విడుదల

హైదరాబాద్ (మే – 30) : తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎస్సై, కానిస్టేబుల్ తుది ‘కీ’ మరియు పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. అన్ని రకాల పోస్టులు కలిపి 1,50,852 మంది అభ్యర్థులు ప్రాథమికంగా ఎంపికైనట్లు తెలిపారు.

జూన్ 30 రాత్రి 8 గంటల నుంచి తుది ‘కీ’ లను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది.

తుది ‘కీ’ మీద అభ్యంతరాలు ఉంటే రికౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని… రీకౌంటింగ్ కు ₹2,000/- , రీ వెరిఫికేషన్ కు ₹3,000/- చెల్లించాల్సి ఉంటుంది.

జూన్ 1వ తారీకు ఉదయం 8.00 గంటల నుండి జూన్ 3వ తేదీ సాయంత్రం 8.00 గంటల వరకు అభ్యర్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ వెబ్సైట్ : https://www.tslprb.in/