OPEN 10th, INTER EXAM FEE : నేటి నుండి పరీక్ష ఫీజు స్వీకరణ

హైదరాబాద్ (ఆగస్టు – 21) : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2023 ఏప్రిల్ అడ్మిషన్లకు సంబంధించిన పరీక్ష ఫీజును చెల్లించడానికి విద్యార్థులకు షెడ్యూల్ విడుదల చేసింది అక్టోబర్ – 2023 నిర్వహించనున్న ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ ఎగ్జామ్స్ (OPEN 10th, INTER EXAM FEE -2023) పరీక్ష ఫీజును నేటినుండి ఆన్లైన్ ద్వారా స్వీకరించనుంది.

★ ఫీజు షెడ్యూల్

ఆగస్టు 21 నుండి ఆగస్టు 31 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు విద్యార్థులు 25/- రూపాయల ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 9 వరకు 50/- రూపాయల ఆలస్య రుసుముతో విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

వెబ్సైట్ : https://www.telanganaopenschool.org/