BIKKI NEWS (డిసెంబర్ – 09) : తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారు. భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి వర్గంలో 11 మందికి అవకాశం (TELANGANA NEW MINISTERS LIST) కల్పించారు.
గడ్డం ప్రసాద్ కుమార్ నూతన శాసనసభ స్పీకర్ గా నియమితులయ్యారు.
రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మొత్తం 11 మందికి మొదటి విడతలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
TS CABINATE PORTFOLIOS
1) ఏ. రేవంత్ రెడ్డి – ముఖ్యమంత్రి, మన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్, లా & ఆర్డర్ – ఇతరులకు కేటాయించని శాఖలు
2) భట్టి విక్రమార్క – ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ, ప్రణాళిక శాఖ, విద్యుత్ శాఖ
3) డీ. అనసూయ సీతక్క – పంచాయతీ రాజ్ శాఖ, మహిళ, శిశు సంక్షేమ శాఖ, రూరల్ డెవలప్మెంట్.
4) కొండా సురేఖ – అటవీ శాఖ, పర్యావరణ శాఖ, దేవదాయ శాఖ
5) యన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి – నీటిపారుదల, CAD, ఆహార, శపౌరసరఫరాల శాఖ
6) కోమటిరెడ్డి వెంకటరెడ్డి – రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ
7) దామోదర రాజనర్సింహ – ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ & టెక్నాలజీ
8) దుద్దిళ్ళ శ్రీదర్ బాబు – ఐ.టీ & అసెంబ్లీ వ్యవహారాల శాఖ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, వాణిజ్య – పరిశ్రమల శాఖ.
9) పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – రెవెన్యూ & హౌసింగ్ శాఖ, సమాచార శాఖ,.
10) తుమ్మల నాగేశ్వరరావు – వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, సహకార శాఖ, హ్యాండ్లూమ్స్ & టెక్స్‌టైల్స్ శాఖ.
11) జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్ శాఖ, టూరిజం & కల్చరల్ శాఖా, ఆర్కీయాలజీ శాఖ.
12) పొన్నం ప్రభాకర్ – రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ.