మోడల్ స్కూల్ టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ (జూలై – 03) : తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచింగ్ సిబ్బంది బదిలీల షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన విడుదల చేశారు.

జులై 5వ తారీఖు నుండి ఆన్లైన్ పద్ధతిలో బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 5 నాడే ఉపాధ్యాయులు ఆన్లైన్ ద్వారా బదిలీలకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆ రోజే వేకెన్సీ లిస్ట్ ను విడుదల చేయనున్నారు.

జులై 14న ఉపాధ్యాయుల బదిలీ సీనీయారిటి పాయింట్లను ప్రకటించనున్నారు.

బదిలీలకై వెబ్ ఆప్షన్లను జూలై 18,19 తేదీలలో ఉపాధ్యాయులు చేసుకోవలసి ఉంటుంది.

జులై 21 నుండి 23 వరకు బదిలీ ఉత్తర్వులను జారీ చేయనున్నారు.