ప్రభుత్వం మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలు పరిష్కారించాలి – PMTA అధ్యక్షుడు తరాల జగదీష్.


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 194 మోడల్ స్కూల్స్ లలో నియామక కాలం నుండి అనగా గత 7 సంవత్సరముల కాలం నుంచి సుమారు 3,000 మంది టిజిటి, పిజిటి లుగా, 100 మంది రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ గా పని చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూల్ టీచర్స్ బదిలీలు చేపట్టాలని పలుమార్లు PMTA TS సంఘము తరుపున విన్నపము చేసినప్పటికీ ఇప్పటికీ చేపట్టలేదు. మోడల్ స్కూల్ టీచర్స్ పలు సమస్యల పట్ల ప్రభుత్వం సవతి ప్రేమను చూపుతుందని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారని వివరిస్తూ గౌరవ ముఖ్య మంత్రి కెసిఆర్ గారే తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్న PMTA TS రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్.


★ మోడల్ స్కూల్ టీచర్స్ బదిలీలు లేక కుటుంబాలకు దూరంగా మానసిక క్షోభ.


తెలంగాణ రాష్ట్రం లోని మోడల్ స్కూల్స్ లలో గత 7 సంవత్సరముల కాలంగా నియామక కాలం నుండి మోడల్ స్కూల్ టీచర్స్ మరియు ప్రిన్సిపాల్స్ ఒకేచోట పనిచేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 194 మోడల్ స్కూల్స్ లలో సుమారు 3000 మంది టిజిటి, పిజిటి లుగా, 100 మంది రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ గా పని చేస్తున్నారు. వీరందరు జోనల్ విధానంలో ఎన్నిక కావడం వల్ల ఎక్కువ మంది ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు వారి సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలో ధీర్ఘకాలంగా కుటుంబాలకు దూరంగా ఉంటూ పనిచేయడం జరుగుతుంది.

దీని వలన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తీవ్ర మానసిక క్షోభకు గురౌతున్నారు. గత సంవత్సరం విద్యా శాఖ పరిదిలో ఉన్న ప్రభుత్వ, పంచాయతీ రాజ్, గురుకులాల్లో బదిలీలు నిర్వహించారు. కాని మోడల్ స్కూల్స్ లలో ఇప్పటి వరకు బదిలీలు చేపట్టలేదు. గతంలో మోడల్ స్కూల్స్ టీచర్స్ బదిలీలు చేపట్టాలని పలుమార్లు విన్నవించిన సర్వీసు రూల్స్ తరువాత చేపడతామని తెలిపారు. కావున ప్రస్తుతం వెంటనే మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని ప్రోగ్రసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (PMTA – TS) తరుపున డిమాండ్ చేస్తున్నాం.

★ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల మృత్యుహేళ.


గత 5 నెలల నుండి 6 గురు ఉపాధ్యాయుల మృతి, మొత్తం గా ఇప్పటి వరకు 19 మంది ఉపాధ్యాయుల మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా గునగల్ మోడల్ స్కూల్ లో పిజిటి సివిక్స్ గా పనిచేస్తున్న విజయలక్ష్మి, కొడకండ్ల మోడల్ స్కూల్ టిజిటి మాథ్స్ నాగరాజు, TSMS లో TGT Maths గా పనిచేస్తున్న శ్రీ మెజెస్, అక్కెనపల్లి మోడల్ స్కూల్ టిజిటి సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీ మహిపాల్ రెడ్డి, సంస్థాన్ నారాయణ పూర్ మోడల్ స్కూల్ పిజిటి జి. సురేష్ కుమార్, రఘునాథ పల్లి మోడల్ స్కూల్ నందు కెమిస్ట్రీ పిజిటి గా పనిచేస్తున్న జె.హెప్సిబా ఎస్తేరు రాణి ఇటీవల మరణించారు.

★ కనీసం డెత్ గ్రాడ్యుటీ కూడా అందడం లేదు.


మోడల్ ఉపాధ్యాయులకు కారుణ్య నియామకాలు ఇంకా వర్తింప చేయనందున చనిపోయిన వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కుటుంబ ఆధారం కోల్పోవడంతో వారి తల్లి దండ్రులు, పిల్లలు భవిష్యత్తు అంధకారము అవుతుంది. కారుణ్య నియామకాలు వర్తింపజేయాలని పలుమార్లు విద్యాశాఖ అధికారులను, ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.కాని ఇప్పటికీ ఆచరణ కరువై కుటుంబాలు ఇంటి ఆధారం కోల్పోయి వారి పిల్లల దిక్కుతోచని స్థితిలో వీధిన పడాల్సిన పరిస్థితి వస్తుంది. కనీసం డెత్ గ్రాడ్యుటీ కూడా కల్పించకపోవడం అత్యంత బాధాకరం .

కావున ఇప్పడికైనా గౌరవ ముఖ్య మంత్రి కెసిఆర్ గారు చొరవ తీసికొని చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి తక్షణమే మోడల్ స్కూల్ కుటుంబాలకు కారుణ్య నియామకాలు వర్తింపజేయాలని PMTA TS సంఘము తరుపున కోరడం జరుగుతుంది.

తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారని వివరిస్తూ గౌరవ ముఖ్య మంత్రి కెసిఆర్ గారే తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్న PMTA TS రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్.

Follow Us@