మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు

హైదరాబాద్ (జూన్ – 13) : తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాలయ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జూనియర్ కళాశాలలో’ 2023 – 24 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం అర్హులైన అల్పసంఖ్యాక వర్గాల (ముస్లింలు క్రైస్తవులు పార్టీలు, జైనులు, సిక్కులు మరియు బౌద్దులు) అభ్యర్థుల నుండి ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.

ఈ కాలేజీలలో యుపిఎస్సి, టీఎస్పీఎస్సీ, ఐఐటి, జేఈఈ, నీట్ వంటి కోర్సులకు ప్రత్యేక శిక్షణ, పౌండేషన్ కోచింగ్ ఇవ్వబడుతుంది.

◆ అర్హతలు : అభ్యర్థి తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2023లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాలలో రెండు లక్షల కన్నా తక్కువగా ఉండాలి.

◆ ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

◆ దరఖాస్తు పద్దతి : ప్రత్యక్ష పద్ధతిలో

◆ దరఖాస్తులకు గడువు : జూన్ 8 నుండి జూన్ 18 వరకు

◆ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణ తేదీ : జూన్ 23 – 2023

◆ ఇంటర్వ్యూ మరియు తుది ఎంపిక తేదీలు : జూలై 1 నుండి జూలై 2 వరకు

ఆసక్తి గల అభ్యర్థులు రాష్ట్రంలోని ఏదైనా తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాలయాల నుండి ఉచితంగా నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని పొంది ఆధార్ కార్డ్ ఎస్ఎస్సి మార్కుల సీట్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సంప్రదించవచ్చును మరియు దరఖాస్తు పారాన్ని విద్యాలయ ప్రిన్సిపాల్ కు అందజేసి హాల్ టికెట్లను అక్కడే పొందవచ్చును.

◆ వెబ్సైట్ :