Home > UNCATEGORY > జీజేసీ సంగెంలో కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం వేడుకలు

జీజేసీ సంగెంలో కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం వేడుకలు

BIKKI NEWS (SEP. 09) : Telangana Language day celebrations in GJC Sangem. ప్రభుత్వ జూనియర్ కళాశాల సంగెం లో కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవంను కళాశాల సిబ్బంది, విద్యార్థుల సమక్షంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ బి. విజయ నిర్మల ఘనంగా నిర్వహించారు.

Telangana Language day celebrations in GJC Sangem

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కాళోజీ గురించి మాట్లాడుతూ….

స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు 1914 లో సెప్టెంబరు 9న కర్నాటక బీజాపూర్‌లోని రట్టిహళ్లిలో జన్మించారు. కాళోజీ అసలు పేరు “రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాస రాంరాజా కాళోజీ”. ముద్దుగా ఈయనను కాళోజీ, కాళన్నా అని పిలుచుకునేవారు. తెలంగాణ ప్రాంతానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారు.

తెలంగాణ వాదాన్ని వినిపించినంత మాత్రాన ఆయన తెలంగాణకే పరిమితం కాలేదు.కాళోజీ రచనలను ప్రేమించిని వారు ఉండరు. ఒక జాతి పట్ల జరుగుతున్న వివక్షను, అన్యాయాన్ని ఎలుగెత్తిన స్వాభిమానిగా ఆయన్ని ప్రాంతాలకు అతీతంగా అభిమానించారు.. జీవితాంతం ఉద్యమ కవితాన్ని వినిపిస్తూ తెలంగాణ ప్రజలలో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలిస్తూ. కవిగా అన్ని ప్రాంతాల ప్రజల అభిమానాన్ని చూరగొన్న విశ్వజనీన కవి కాళోజీ.
నాది బడి పలుకుల భాష కాదు.. పలుకుబడుల భాష. నా మాతృభాష తెలుగు’ అని ఎలుగెత్తి చాటిన మహానుభావుడు ఆయన.

పరభాషాలను నేర్చుకోవటాన్ని కాళోజీ ఎప్పుడు వ్యతిరేకించాలే. కానీ ఆ సాకుతో మాతృభాషను నిర్లక్ష్యం చేయటాన్ని మాత్రం సహించేవారు కాదు. నేటి తరం.. తెలుగు పదాలనే మర్చిపోతోందని కాళోజీ ఆవేదన చెందే వారు. తేటతెలుగు భాషకు పూర్వ వైభవం రావాలని ఆకాంక్షించే వారు. తెలంగాణ యాసను వెక్కిరిస్తే కాళోజీ సహించే వారు కాదు. ఎవరి యాస వారికి గొప్ప అని గట్టిగా చెప్పేవారు.
ఇతర భాషలపై మోజుతో మాతృభాషను విస్మరించేవారిని కాళోజీ గొప్పగా హెచ్చరించారు అందుకే ఆయన జయంతి ‘తెలంగాణ భాషా దినోత్సవం’ అయింది. తెలుగు భాష పట్ల ఆ ప్రజాకవికి మమకారం ఎనలేనిది.

ఏ భాష నీది ఏమి వేషమురా
ఈ భాష ఈ వేషమెవరి కోసమురా
ఆంగ్లమందున మాటలనగానే
ఇంత కుల్కెదవెందుకు రా
తెలుగువాడివై తెలుగు రాదనుచు
సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా
అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా!
అని తెలుగు భాష ప్రాశస్త్యాన్ని వివరించారు.

రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహ మాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తి గడించాడు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో కడతాయి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కలం, గళం ఎత్తిన ఈ శతాబ్దపు మేటి కవి కాళన్న.

ఆయనకు 1972లో తామ్రపత్రం పురస్కారం, 1992లో భారత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ వరించాయి. తెలంగాణలో ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఉండాలన్నది ఆయన కోరిక. ఆయన నవంబర్ 12 న 2002లో వరంగల్ లో పరమపదించారు. కాళోజీ తన పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి ప్రయోగాల కోసం ఇచ్చారని ప్రసగించారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ విజయ నిర్మల , అనిల్ కుమార్, పవన్ కుమార్ , బుచ్చిరెడ్డి, రాజ్ కుమార్, కుమారస్వామి, యక సాయిలు, నాగరాజు, మాధవి, చిరంజీవి, రాఖీ, సుధీర్ కుమార్, పద్మ, రమాదేవి, సదయ్య, లక్ష్మి, సంగీత, శివ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు..

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు