JOB CALENDAR – తెలంగాణ జాబ్ కేలండర్ విడుదల

BIKKI NEWS (AUG. 02) : TELANGANA JOB CALENDAR 2024 – 25 RELEASED. తెలంగాణ జాబ్ కేలండర్ 2024 – 25 కు అసెంబ్లీ విడుదల చేశారు. జాబ్ కేలండర్ కు చట్టబద్ధత కల్పించారు. అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ మేరకు ప్రకటన చేశారు.

TELANGANA JOB CALENDAR 2024 – 25 RELEASED

ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయాలి దరఖాస్తు గడువు పరీక్ష తేదీలతో సహా స్పష్టంగా పేర్కొన్నారు.

అక్టోబర్ లో గ్రూప్ – 1 పరీక్షలు, నవంబర్ లో గ్రూప్ – 2 పరీక్షలు, డిసెంబర్ లో గ్రూప్ – 3 పరీక్షలు నిర్వహించనున్నారు.

గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలు 2025 జూలైలో నిర్వహించనున్నారు.

TGPSC గ్రూప్ – 2 నోటిఫికేషన్ మే 2025 లో విడుదల చేసి, అక్టోబర్ లో పరీక్షలు నిర్వహించనున్నారు.

గ్రూప్ – 3 నోటిఫికేషన్ జూలై 2025 లో విడుదల చేసి, నవంబర్ లో పరీక్షలు నిర్వహించనున్నారు.

వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో నర్సింగ్ ఆఫీసర్లు మరియు ల్యాబ్ టెక్నీషియన్ల కోసం సెప్టెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్ లో పరీక్షలు నిర్వహించనున్నారు.

ట్రాన్స్ కో లో వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం 2024 అక్టోబర్ లో నోటిఫికేషన్ జారీ చేసి , 2025 జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నారు.

వివిధ శాఖలలో గెజిటెడ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి, ఎప్రిల్ లో పరీక్షలు నిర్వహించనున్నారు.

టెట్ నోటిఫికేషన్ నవంబర్ 2024లో విడుదల చేసి, జనవరి 2025లో పరీక్షలు నిర్వహించనున్నారు.

డీఎస్సీ నోటిఫికేషన్ 2025 ఫిబ్రవరి లో విడుదల చేసి ఏప్రిల్ లో పరీక్షలు నిర్వహించనున్నారు.

డిగ్రీ కళాశాలలో డిగ్రీ లెక్చరర్లు ఫిజికల్ డైరెక్టర్లు లైబ్రేరియన్ పోస్టులకు 2025 జూన్ లో నోటిఫికేషన్ జారీ చేసి, సెప్టెంబర్ లో పరీక్షలు నిర్వహించనున్నారు.

ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ 2025 ఏప్రిల్ లో విడుదల చేసి ఆగస్ట్ లో పరీక్షలు నిర్వహించనున్నారు.

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కొరకు 2025 ఫిబ్రవరిలో నోటిఫికేషన్, మే లో పరీక్షలు నిర్వహించనున్నారు.

సింగరేణిలో ఉద్యోగాల కోసం జూలై 2025లో నోటిఫికేషన్ జారీ చేసి, నవంబర్ లో పరీక్షలు నిర్వహించనున్నారు.

TG JOB CALENDAR PDF FILE

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు