జేఎల్, డీఎల్, పీఎల్ పోస్టులతో భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ (జూలై – 22) : భారీ సంఖ్యలో జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయడానికి అనుమతి ఇస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ ఈరోజు జీవోలు విడుదల చేసింది.

జూనియర్ లెక్చరర్ (JL) 1392, డిగ్రీ లెక్చరర్ (DL) 491, పాలిటెక్నిక్ లెక్చరర్ (PL) 247 పోస్టుల భర్తీకి ఆర్దిక శాఖ అనుమతులు జారీ చేసింది.

దీంతో ఉన్నత విద్యావంతులైన నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెపినట్లు అయింది. త్వరలోనే వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేయనుంది.

80 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం కేసీఆర్ శాసనసభ సాక్షి ఇచ్చిన మాట ప్రకారం వరుసపెట్టి ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల అవుతున్నాయి.

ఖాళీల వివరాలు కింద విధంగా ఉన్నాయి.

జూనియర్ లెక్చరర్
పాలిటెక్నిక్ లెక్చరర్
డిగ్రీ లెక్చరర్
Follow Us @