త్వరలో ఇంటర్ పరీక్ష ఫీజు వసూలుకు టైం టేబుల్.!

ఏప్రిల్‌ చివరి వారంలో పరీక్షలను ప్రారంభించాలనే ఆలోచనలో బోర్డు వర్గాలు ఉన్నట్లు సమాచారం. సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించిన నేపథ్యంలో మార్చి నెలాఖరు వరకు సిలబస్‌ పూర్తి అయ్యో అవకాశాలు ఉన్నాయి.

పరీక్షల నిర్వహణ తేదీలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో పరీక్ష ఫీజు వసూలుకు సంబంధించిన టైం టేబుల్ కూడా జారీ చేయనున్నారు. ఇంటర్‌ రెండు సంవత్సరాలు కలిపి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

జ‌న‌వ‌రి 18వ తేదీ నుంచి జూనియర్‌ కళాశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, తరగతులను షిఫ్టు పద్ధతిలో నిర్వహించాలా లేదా రోజు తరవాత రోజు నిర్వహించాలా అన్న అంశంపై ప్రభుత్వానికి ఇంటర్‌బోర్డు ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుండి అమోదం లబించగానే ఆప్ లైన్ తరగతులు ప్రారంభించడానికి ఇప్పటికే సన్నహకంగా పూర్తి స్థాయిలో సిబ్బందిని కూడా కళాశాలలకూ హజరు కావాలని కమీషనర్ ఒమర్ జలీల్ ఉత్తర్వులు కూడా ఇచ్చారు.

Follow Us@