హైదరాబాద్ (ఫిబ్రవరి – 07) : తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు నాలుగు వేల వీడియో పాఠాలను యూట్యూబ్ (INTERMEDIATE YOUTUBE CHANNEL) ద్వారా ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది.
జనరల్, వొకేషనల్ తో పాటు సైన్స్ ప్రయోగ పరీక్షల పాఠాలు, పరీక్షలకు సంబంధించిన టిప్స్, ప్రోత్సాహాన్ని ఇచ్చే ప్రసంగాలను కూడా చేర్చింది. యూట్యూబ్ లో ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ-లెర్నింగ్ తెలంగాణ’ అని సెర్చ్ చేయాలని శాఖ కమిషనర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.