INTER ADMISSIONS – ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల

BIKKI NEWS (APR. 30) : Telangana Intermediate admissions 2025 schedule. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ 2025 – 26 విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ల వరకు షెడ్యూల్ ను విడుదల చేసింది.

Telangana Intermediate admissions 2025 schedule.

ఈరోజు పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో అడ్మిషన్ల షెడ్యూల్ ను బోర్డు విడుదల చేసింది.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడేడ్ జూనియర్ కళాశాలలు, గురుకుల జూనియర్ కళాశాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, కంపోజిట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని ఈ ప్రకటనలో తెలిపారు.

మే ఒకటి నుండి మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూనియర్ కళాశాలల్లో జూన్ 2 నుండి తరగతులు ప్రారంభం అవుతాయి. మొదటి దశ అడ్మిషన్ జూన్ 30వ తేదీ వరకు ముగించాల్సి ఉంటుంది.

విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు చేత గుర్తింపు పొందిన కళాశాలల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలని, గుర్తింపు పొందిన కళాశాలల వివరాలను బోర్డ్ అధికారిక వెబ్సైట్ లో (tgbie.cgg.gov.in) అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు