హైదరాబాద్ (మే – 17) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ (telangana inter advanced supplementary exams schedule 2023) ను విడుదల చేసింది.
జూన్ 12 నుంచి జూన్ 19 వరకు ఉదయం ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.00 నుండి 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
మే 19 వరకు విద్యార్థులు కళాశాలలో ఫీజు చెల్లించుటకు గడువు కలదు.
సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ – 05 నుంచి 09 వరకు రెండు సెషన్స్ లలో నిర్వహిస్తారు.
ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 21న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 22న ఉదయం 10 గంటల నుండి నిర్వహించనున్నారు.
★ పరీక్షల షెడ్యూల్ :
జూన్ – 12 : సెకండ్ లాంగ్వేజ్ – I & II
జూన్ – 13: ఇంగ్లీషు – I & II
జూన్ – 14 : మ్యాథ్స్ A, బోటనీ, సివిక్స్ – I & II
జూన్ – 15 : మ్యాథ్స్ – B, జూవాలజీ, హిస్టరీ – – I & II
జూన్ – 16 : ఫిజిక్స్ & ఎకానమిక్స్ – I & II
జూన్ – 17 : కెమిస్ట్రీ & కామర్స్ – I & II