కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ఉన్నత విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే (సీబీఎస్ఈ) పదోతరగతి పరీక్షలను రద్దు చేయగా, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే అకాడమిక్ ఇయర్ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మే 1 నుండి జరగాల్సిన పరీక్షలను నిరవధిక వాయిదా వేశారు.
ఇంటర్ పస్టీయర్ విద్యార్థులను ఎలాంటి పరీక్ష లేకుండా సెకండ్ ఇయర్ కి ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత పస్టీయర్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు.
జూన్ మొదటి వారంలో మరొక్కసారి సమీక్షించి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మీద నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ప్రస్తుతం సెకండీయర్ చదువుతున్న విద్యార్థులకు పస్టీయర్ లో ఉన్న బ్యాక్ లాగ్స్ ను మినిమం పాస్ మార్కులతో పాస్ చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే ఈ సంవత్సరం ఎంసెట్ లో ఇంటర్మీడియట్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజ్ ను తొలగించారు.
