మే రెండో వారంలో ఇంటర్, పది ఫలితాలు

హైదరాబాద్ (ఏప్రిల్ 21) : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్,
పదో తరగతి ఫలితాలు మే రెండో వారంలో విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇప్పటికే ఇంటర్మీడియట్ స్పాట్ వ్యాల్యూయేషన్ పూర్తి అయినట్లు సమాచారం. పదో తరగతి స్పాట్ వాల్యూయోషన్ రెండు రోజుల్లో పూర్తి కానుంది.

తదనంతరం మార్కుల క్రోడీకరణ, టాబ్యులేషన్ పూర్తికి 10 రోజులు పట్టనున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు.