INTER : అడ్మిషన్ల గడువు పెంపు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 01) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2023 – 24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల గడువును సెప్టెంబర్ 16 వరకు పెంచడం (telangana inter admissions date extended up to 16th september) జరిగింది.

ప్రభుత్వ & ప్రభుత్వ రంగ జూనియర్ కళాశాలల్లో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అడ్మిషన్లు పొందవచ్చు.

1,000/- రూపాయల ఆలస్య రుసుముతో ప్రైవేటు విద్యా సంస్థలలో అడ్మిషన్లు పొందవచ్చు.

విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ బోర్డు చేత అనుమతి పొందిన కళాశాలలోనే అడ్మిషన్లు పొందాలని ఈ సందర్భంగా బోర్డ్ సూచించింది. అనుమతి పొందిన కళాశాలల జాబితాను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పొందడానికి కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.

INTER ADMISSIONS LINK

◆ వెబ్సైట్ : https://tsbie.cgg.gov.in/home.do