హైదరాబాద్ (మార్చి – 24) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణ కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 16 కొట్టివేయాలని హైకోర్టులో దాఖలు చేసిన కేసును (WP(TR)5972/2017) ఈరోజు తెలంగాణ హైకోర్టు వాదనలు విన్న హైకోర్టు ఎప్రిల్ 18 కి వాయిదా వేసినట్లు సమాచారం. ఇప్పటికే పలు కేసులను ఈ విషయం మీద హైకోర్టు కొట్టివేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 11వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు అధ్యాపకులను క్రమబద్ధీకరణ చేయడం కోసం జీవో నెంబర్ 16 ను2016లో విడుదల చేసింది. ఏప్రిల్ ఒకటి నుండి వీరి సర్వీసులు క్రమబద్ధీకరణ అవుతాయని శాసనసభ సమావేశాల సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.