COURT JOBS : ఆఫీస్ సబార్డీనేట్, ప్రోసెస్ సర్వర్ ఉద్యోగాల అర్హుల జాబితా విడుదల

హైదరాబాద్ (జూన్ – 15) : తెలంగాణ హైకోర్టు పరిధిలో ఆఫీస్ సబార్డినేట్ మరియు ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాల (Telangana High court office subordinate and process server jobs merit list 2023) కోసం నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన వారి హాల్ టికెట్ల జాబితాను విడుదల చేశారు.

ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ పోస్టులకు ఇంటర్వ్యూ కు ఎంపికైన వారి హల్ టికెట్ల నంబర్లను జిల్లాల వారిగా జాబితాను విడుదల చేశారు. ఇంటర్వ్యూలకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇంటర్వ్యూ నిర్వహించే తేదీలను త్వరలో వెల్లడించనున్నారు.

వెబ్సైట్ :https://tshc.gov.in/getRecruitDetails