GURUKULA JOBS : పరీక్షల నిర్వహణ తీరు

హైదరాబాద్ (జూన్ – 19) : తెలంగాణ వివిధ సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి ఆగస్టు 1 నుంచి 22 వరకు రాతపరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో హల్ టికెట్లు పరీక్షలకు వారం ముందు విడుదల చేయనున్నారు.

పోస్టుల కేటగిరీ, సబ్జెక్టుల వారీగా 180కి పైగా సెషన్లుగా నిర్వహించాల్సిన పరీక్షలను.. వచ్చిన దరఖాస్తులు, సబ్జెక్టుల మేరకు 54 సెషన్లలోనే ముగించేందుకు కార్యాచరణ ప్రకటించామని మల్లయ్య భట్టు పేర్కొన్నారు.

★ షెడ్యూల్ ఇలా ::

  • 18 రోజులపాటు మూడు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి.
  • డిగ్రీ లెక్చరర్(డీఎల్), జూనియర్ లెక్చరర్ (జేఎల్), పీజీటీ పోస్టులకు పేపర్-1 పరీక్ష (జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఆంగ్ల భాష ప్రావీణ్యం) ఆగస్టు 10న మూడో షిప్టు, ఆగస్టు 11న మొదటి రెండు షిఫ్టుల్లో జరుగనుంది.
  • డిగ్రీ విద్యార్హతతో కూడిన టీజీటీ, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు ఉమ్మడిగా నిర్వహించే పేపర్-1 పరీక్ష ఆగస్టు 11న మూడో షిఫ్టు, ఆగస్టు 12న జరిగే మూడు షిఫ్టులతో ముగియనుంది. సబ్జెక్టులను గ్రూపులుగా చేసి.. ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తున్నందు వల్ల మార్కుల గణనలో ఇబ్బందులు ఉండవు.
  • జేఎల్, పీజీటీ పోస్టులకు సంబంధించి సబ్జెక్టు బోధన సామర్థ్యాలపై నిర్వహించే పేపర్-2 పరీక్ష సిలబస్ ఒకటే. అందుకే దీన్ని ఉమ్మడిగా నిర్వహిస్తాం. ఈ పరీక్షలో వచ్చిన మార్కులను జేఎల్, పీజీటీ పోస్టులకు పరిగణనలోకి తీసుకుంటారు.
  • హాల్ టికెట్లను పరీక్ష తేదీలకు వారం రోజుల ముందు గురుకుల బోర్డు వెబ్సైట్ లో పొందు పర్చనున్నట్లు మల్లయ్య బట్టు తెలిపారు.