గురుకుల ఉద్యోగులకు ఏకరూప స్కేల్స్ వర్తింపచేయాలి

హైదరాబాద్ (ఆగస్టు – 15) : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలలు, కళాశాలలో పనిచేస్తున్న బోధన సిబ్బందికి గతంలో మాదిరిగా ఏకరూప స్కేల్స్ వర్తింపచేయాలని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ (టీజీపీఏ) ఆధ్వర్యంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు‌, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందచేశారు.

ప్రభుత్వ విద్యాశాఖకు వర్తింపచేసే అన్ని జీవోలను గురుకుల సొసైటిలకు అమలు చేయాలన్నారు . కుటుంబాలకు దూరంగా సుదూర ప్రాంతాల్లో పనిచేసేవారికి కౌన్సెలింగ్ తో బదిలీలు చేపట్టాలని కోరారు. అన్ని గురుకుల సొసైటీ ఉద్యోగులకు ఏకరూప పే స్కెల్ లు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాలలో పనిచేసే ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్ కి మాదిరిగా గురుకుల ప్రిన్సిపాల్స్ లెక్చరర్స్ కి గెజిటెడ్ హోదా కల్పించాలన్నారు. మైనార్టీ సొసైటీ పాఠశాలలు, కాలేజీలలో కామన్ ఎంట్రన్స్ ద్వారా అడ్మిషన్లు నిర్వహించాలన్నారు. నిత్యం పనిభారంతో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని , వారికి క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ సదుపాయం కల్పించాలని వారు కోరారు.

వినతిపత్రం ఇచ్చినవారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రౌతు అజయ్ కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ తనుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.