BIKKI NEWS (FEB. 08) : తెలంగాణ గురుకుల విద్యాసంస్థల 9,210 ఉద్యోగ నియామకాలు హైకోర్టు తీర్పు ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేస్తామని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ప్రకటించింది. అలాగే ఫలితాలు (TELANGANA GURUKULA JOBS RESULTS RELEASED LINK) వెల్లడించింది. ఇప్పటికే తుది కీ వెల్లడించిన విషయం తెలిసిందే.
GURUKULA JOBS RESULTS LINK
★ లైబ్రేరియన్, పీడీ లకు డెమో
లైబ్రేరియన్ ము ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు డెమో తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 10, 11, 12 వ తేదీలలో ఈ పోస్టులకు డెమో తరగతులు నిర్వహించనున్నారు. 13 వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నారు.
★ హారిజాంటల్ రిజర్వేషన్లే
గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే నియామకాలు జరుగుతాయని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. హారిజాంటల్ రిజర్వేషన్లపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసును విచారించిన హైకోర్టు.. వారి పిటిషన్ ను మంగళవారం కొట్టేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా హారిజాంటల్ రిజర్వేషన్ ను అమలు చేసుకోవచ్చని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే హారిజాంటల్ పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు అవుతాయని, మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్లేమీ ఉండవని గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు స్పష్టం చేసింది.
https://treirb.telangana.gov.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- CURRENT AFFAIRS 4th DECEMBER 2024
- RBI – వడ్డీరేట్లు యధాతధం
- 10th class – పదో తరగతిలో సెమిస్టర్ విధానం.!
- INTER EXAMS – మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు