హైదరాబాద్ (జూన్ – 16) : తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 9,210 పోస్టులకు ఆగస్టు 1 నుంచి 23 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించాలని గురుకుల నియామక బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టుల కోసం 2.63 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు మ. సమగ్ర షెడ్యూల్ ను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు బోర్డు కార్యనిర్వాహక అధికారి మల్లయ్య బట్టు తెలిపారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టులు టిజిటి 4,006, జూనియర్ కళాశాల లెక్చరర్లు 2,008, డిగ్రీ అధ్యాపకులు 868, లైబ్రేరియన్ 434, పిజిటి 1,276, ఫిజికల్ డైరెక్టర్ 275, ఆర్ట్ టీచర్ 132, క్రాఫ్ట్ టీచర్ 88, మ్యూజిక్ టీచర్ 123.
గురుకుల నియామక పరీక్షలను ఇతర పరీక్షల తేదీలతో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకొని షెడ్యూలు విడుదల చేయనున్నారు ఆగస్టు ఒకటి నుండి 23 వరకు పరీక్షలు నిర్వహించి అక్టోబర్ నాటికి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ విద్యా సంవత్సరం లోనే నియామకాలు పూర్తి చేసేలా ఏర్పాట్లను బోర్డు చేస్తుంది.