GURUKULA JOBS KEY PAPERS : కీ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (ఆగస్టు – 24) : TELANGANA GURUKULA JOBS KEY PAPER ను ట్రిబ్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది.

ఆయా పోస్టుల వారీగా ఈ నెల 19 వరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన కీతో కూడిన మాస్టర్ ప్రశ్నా పత్రాలను వెబ్సైట్ లో పొందుపరిచినట్టు ట్రిబ్ తెలిపింది.

20 నుంచి 23 వరకు పరీక్షల కీని గురువారం అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించింది.

అభ్యర్థులు తన లాగిన్ ఐడీద్వారానే కీ పేపర్ తో పాటు ప్రశ్నాపత్రాలను చూసుకోవచ్చని పేర్కొన్నది.

కీపై అభ్యంతరాలుంటే ఆగస్టు 26లోపు తమ లాగిన్ ఐడీ ద్వారా మాత్రమే తెలియజేయాలని ట్రిబ్ సూచించింది. ఈ-మెయిల్, పిటిషన్లను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.

9210 పోస్టులకు గానూ 9 నోటిఫికేషన్ ల ద్వారా ఖాళీల భర్తీ ప్రక్రియలో కీలకమైన పరీక్షల ఘట్టం ముగిసింది. ఓవరాల్ గా 75.68% మంది అభ్యర్థులు పరీక్షకు హజరయ్యారు.

వెబ్సైట్ : https://treirb.telangana.gov.in