గురుకుల ఉద్యోగ దరఖాస్తుకు OTR తప్పనిసరి

హైదరాబాద్ (ఎప్రిల్ – 11) : తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి OTR ద్వారా అప్లికేషన్లు స్వీకరించేందుకు TREIRB బోర్డు ఏర్పాట్లు చేసింది. OTR ప్రక్రియ ఎప్రిల్ 12 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. OTR నమోదు ద్వారా అర్హత కల్గిన పోస్టులకు నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీ కోసం బోర్డు ఇటీవలే 9 ఉద్యోగ ప్రకటనలు ఇచ్చింది. దరఖాస్తుల ప్రక్రియను ఈ నెల 17 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది.