హైదరాబాద్ (జూలై – 24) : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి ఆగస్టు 1 నుంచి 22 వరకు రాతపరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో హల్ టికెట్లను ఈరోజు ఆన్లైన్ లో అందుబాటులో ఉంచారు. (Telangana Gurukula Jobs Hall Tickets Download link) కింద ఇవ్వబడిన లింకు ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
◆ పరీక్షల షెడ్యూల్ ఇలా :
- 18 రోజులపాటు మూడు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి.
- డిగ్రీ లెక్చరర్(డీఎల్), జూనియర్ లెక్చరర్ (జేఎల్), పీజీటీ పోస్టులకు పేపర్-1 పరీక్ష (జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఆంగ్ల భాష
ప్రావీణ్యం) ఆగస్టు 10న మూడో షిప్టు, ఆగస్టు 11న మొదటి రెండు
షిఫ్టుల్లో జరుగనుంది. - డిగ్రీ విద్యార్హతతో కూడిన టీజీటీ, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్
పోస్టులకు ఉమ్మడిగా నిర్వహించే పేపర్-1 పరీక్ష ఆగస్టు 11న
మూడో షిఫ్టు, ఆగస్టు 12న జరిగే మూడు షిఫ్టులతో ముగియనుంది.
సబ్జెక్టులను గ్రూపులుగా చేసి.. ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తున్నందు వల్ల మార్కుల గణనలో ఇబ్బందులు ఉండవు. - జేఎల్, పీజీటీ పోస్టులకు సంబంధించి సబ్జెక్టు బోధన సామర్థ్యాలపై నిర్వహించే పేపర్-2 పరీక్ష సిలబస్ ఒకటే. అందుకే దీన్ని ఉమ్మడిగా నిర్వహిస్తాం. ఈ పరీక్షలో వచ్చిన మార్కులను జేఎల్, పీజీటీ పోస్టులకు పరిగణనలోకి తీసుకుంటారు.