GURUKULA JOBS : దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ – TREI RB

హైదరాబాద్ (జూన్ – 13) : తెలంగాణ గురుకులాల విద్యాల‌యాల సొసైటీ ప‌రిధిలో ఖాళీగా ఉన్న 9,231 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది గురుకుల నియామ‌క బోర్డు.

అభ్య‌ర్థులు ఒకసారి మాత్ర‌మే త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చు. ఎడిట్ చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను ప్రింట్ తీసుకుని భ‌ద్ర‌ప‌రుచుకోవాని సూచించారు.

జూనియ‌ర్ లెక్చ‌రర్స్, ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్, లైబ్ర‌రీయ‌న్, పీజీటీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారు జూన్ 14 నుంచి 19వ తేదీ మ‌ధ్య‌లో త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు.

డిగ్రీ కాలేజీలకు సంబంధించిన లెక్చ‌ర‌ర్, ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్, లైబ్ర‌రీయ‌న్, లైబ్ర‌రీయ‌న్(స్కూల్స్), ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్(స్కూల్స్), డ్రాయింగ్, ఆర్ట్ టీచ‌ర్లు, క్రాఫ్ట్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్, క్రాఫ్ట్ టీచ‌ర్, మ్యూజిక్ టీచ‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారు జూన్ 20 నుంచి 24వ తేదీ మ‌ధ్య‌లో ఎడిట్ చేసుకోవ‌చ్చు.

టీజీటీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు జూన్ 25 నుంచి 30వ తేదీ మ‌ధ్య‌లో త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు.

◆ వెబ్సైట్ : https://treirb.telangana.gov.in/index.php