హోంశాఖ సహాయ మంత్రి దృష్టికి గెస్ట్ లెక్చరర్ల సమస్యలు

BIKKI NEWS (JULY 08) : Telangana guest lectures issues. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న మరియు డిస్టర్బ్ అయిన దాదాపు 2,000 మంది గెస్ట్ జూనియర్ లెక్చరర్ల సమస్యలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దృష్టికి జగిత్యాల జిల్లా గెస్ట్ లెక్చరర్లు తీసుకెళ్లారు.

Telangana guest lectures issues.

తమ సమస్యలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగిందని, దానికి సానుకూలంగా మంత్రి స్పందించారని గెస్ట్ లెక్చరర్ లు తెలిపారు.

ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్స్ కు గత నాలుగు నెలల నుండి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని,
ఈ విద్య సంవత్సరం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా ఇంకా రెన్యూవల్ ఉత్తర్వులు రాలేదని, గత సంవత్సరం టీజీపీఎస్సీ జేఎల్ నియామకాల వల్ల దాదాపు 1300 మంది ఉద్యోగాన్ని కోల్పోయి రోడ్డున పడ్డారని తెలిపారు.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యోగ భద్రత 12 నెలల వేతనం, ఎంటిఎస్ చేయడం వంటి అంశాలను పరిశీలించాలని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రస్తుతం గత పది సంవత్సరాలుగా 430 జూనియర్ కళాశాలలో దాదాపు 2,000 మంది పనిచేస్తున్నారని, గత సంవత్సరం 1,300 మంది డిస్టర్బ్ అయ్యారని, మా సమస్యలు అన్నింటి పైన కులంకశంగా చర్చించి మాకు న్యాయం కల్పించాలని కోరడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు గుర్రాల సాయికృష్ణ, రాంబాబు, లక్ష్మణ్, జ్ఞానేశ్వర్, నాగేశ్వరి లు పాల్గొన్నారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు