గ్రూప్ – 2 లో మరో 66 పోస్టులు, ఖాళీల వివరాలు

హైదరాబాద్ (డిసెంబర్ 03) : తెలంగాణ రాష్ట్రంలో గతంలో 663 గ్రూప్-2 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చిన ఆర్ధిక శాఖ.. ఇటీవల వాటికి కొత్తగా మరో 66 పోస్టులను కలుపుతూ ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఏఎస్వో, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను కొత్తగా జత చేసింది. ఫలితంగా ఈ క్యాటగిరీలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 729కి పెరగనున్నది.

గ్రూప్-2లో ప్రభుత్వం కొత్తగా చేర్చిన పోస్టులన్నీ తాసిల్దార్ కంటే ఎక్కువ హోదా కలిగినవే. ఈ నేపథ్యంలో గ్రూప్-2 ఉద్యోగాలకు డిసెంబర్ లోనే నోటిఫికేషన్ ఇచ్చి, మే నెలలో పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

ఖాళీల వివరాలు :