పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటి

BIKKI NEWS (MARCH 01) : రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. త్వరలోనే రెండు కమిషన్ లను (telangana govt forming two commissions on education and agriculture) ప్రకటించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌర సమాజం ప్రతినిధులతో భేటి సందర్భంగా ప్రకటించారు.

మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నాం. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో ఏర్పాటు చేయనున్నాం.

గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేశాం. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎఎస్సీ ద్వారా నియామకాలు చేపడతాం.

కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. అందరి సూచనలు, సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నాం. రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నాం. పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.