హైదరాబాద్ (ఆగస్టు – 06) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే భారీ మభ్యంతర భృతి (IR) ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే పిఆర్సి కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన 9 ఏళ్లలోనే 70% వేతనాలను పెంచామని ఉద్యోగులను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నామని తెలిపారు.
త్వరలో ఉద్యోగ సంఘాల తో భేటీ అయిన తర్వాత పిఆర్సి కమిటీ, IR ల పై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రెండు వేతన సంఘం ఏర్పాటు చేసి దేశం ఆశ్చర్యపోయేలా ఫిట్మెంట్ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.