BIKKI NEWS (JULY 11) : Telangana Engineers day on July 11th behalf of Ali Nawaj Jung Bahadur Birth anniversary. తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 11న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతుంది. హైదరాబాదు సంస్థానం కు చెందిన ఇంజనీరు అలీ నవాజ్ జంగ్ బహదూర్ (Ali Nawaj Jung Bahadur) జన్మదినమైన జూలై 11ను తెలంగాణ ప్రభుత్వం 2014లో తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించి, ఆయన జయంత్యుత్సవాలను ఎర్రమంజిల్‌లోని జలసౌధలో ఘనంగా జరిపింది.
Telangana Engineers day on July 11th
ప్రారంభం
నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ హైదరాబాదుకు చెందిన ఇంజనీరు. ఈయన 1877, జూలై 11న హైదరాబాదులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తెలంగాణ నీటిపారుదల పితామహుడిగానూ, తెలంగాణ ఆర్థర్ కాటన్‌గా అభివర్ణించబడిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్, అప్పటి హైదరాబాద్ రాజ్యంలో అనేక నీటి పారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి నిర్మించాడు.
ప్రభుత్వాలపై భారం పడకుండా దీర్ఘ కాలం రైతులకు ప్రజలకు ఉపయోగకరంగా తక్కువ ఖర్చు, నాణ్యతతో కూడిన సాగునీటి ప్రాజెక్టులు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ నిర్మించాడు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గౌరవార్థం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా 2014, జూలై 10న జి.ఓ. నంబరు 18 జారీ చేసి అలీ నవాజ్ జంగ్ బహాదూర్ ఆయన జన్మదినాన్ని తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించి ప్రతి సంవత్సరం అధికారికంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
కార్యక్రమాలు
ఈ దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల్లో విశిష్ట సేవలు అందించిన విశ్రాంత ఇంజనీర్లకు 2015 నుండి నవాజ్ జంగ్ స్మారక జీవిత సాఫల్య పురస్కారాలను అందజేస్తున్నారు.