హైదరాబాద్ (జూన్ 08) : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల డిపార్ట్ మెంటల్ టెస్ట్ లను జూన్ 15 నుంచి 24 వరకు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ తెలిపారు.
సర్వే అండ్ లాంగ్వే జ్ టెస్ట్ మినహా మిగతా ఆబ్జెక్టి వ్ టైపు పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహిస్తామని వెల్లడించారు. జూన్ 9 సాయంత్రం 5.00 గంటల నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు 040 -22445566ను
సంప్రదించాలని కోరారు.
◆ వెబ్సైట్ : https://www.tspsc.gov.in/