డీఏ, డీఆర్ – బకాయిల ఉత్తర్వులు విడుదల

హైదరాబాద్ (జూన్ – 26) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల, పెన్షనర్ల డీఏ, డీఆర్ బాకయిలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డీఏ 2.73% బకాయిలను జనవరి – 01 – 2022 నుంచి 17 విడుదల గా జూలై 2023 నుంచి విడుదల చేయనుంది.

పాత పెన్షన్ ఉద్యోగులకు జనవరి 01 – 2022 నుండి మే – 31 – 2023 వరకు డీఏ బకాయిలను జులై 2023 లో GPF లో జమ చేస్తారు.

నూతన పెన్షన్ ఉద్యోగులకు జనవరి 01 – 2022 నుండి మే – 31 – 2023 వరకు డీఏ బకాయిలలో 10% వారి PRAN NUMBER లో జమచేసి మిగతా 90% జులై – 2023 నుండి 17 విడతలుగా చెల్లిస్తారు.

పెన్షనర్లకు జనవరి 01 – 2022 నుండి మే – 31 – 2023 వరకు డీఏ బకాయిలను జులై 2023 నుండి 17 సమాన వాయిదాలలో చెల్లిస్తారు.