TS EMRS : తెలంగాణ ఏకలవ్య మోడల్ స్కూల్ అడ్మిషన్లు

హైదరాబాద్ (మార్చి – 26) : తెలంగాణ రాష్ట్రంలో గల (23) ఏకలవ్య గురుకుల పాఠశాలలలో (TS EKALAVYA MODEL RESIDENTIAL SCHOOLS ADMISSIONS) 2023-24 సంవత్సరంనకుగాను 6వ తరగతిలో ప్రవేశాలు మరియు 7వ, 8వ, 9వ తరగతులలో గల మిగిలిన ఖాళీలను నింపడానికి నిర్వహించబడుతున్న ప్రవేశపరీక్షకు అర్హులైన విద్యార్థిని మరియు విద్యార్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుతున్నవి.

◆ దరఖాస్తు ప్రారంభ తేది : 27-03-2023.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ చివరి తేది : 20-04-2023.

◆ ప్రవేశ పరీక్ష తేది: 07 – 05 – 2023.

◆ ఎంపిక విధానం :ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్లు పాటిస్తూ విద్యార్థులను ఎంపిక చేయబడును.

◆ వెబ్సైట్ : https://tsmessemrs.in/#