BIKKI NEWS (FEB. 27) : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మరో 5,973 టీచర్ పోస్టులను అదనంగా భర్తీ చేసేందుకు (telangana dsc notification with 11602 posts) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రెండు వేర్వేరు జీవోలను జారీచేసింది.
జీవో -27 ద్వారా 4,957 పోస్టుల భర్తీ, 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాల నియామకానికి జీవో -26ను ఆర్థికశాఖ జారీచేసింది.
గతంలో 5,089 పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీచేసిన విషయం తెలిసిందే. మొత్తం పోస్టుల సంఖ్య 11,062కు చేరింది. ఈ పోస్టులకు పోటీపడేందుకు 1.77లక్షల మంది అభ్యర్థులు గతంలోనే దరఖాస్తు చేసుకొన్నారు.
పాత డీఎస్సీని రద్దు చేయనున్నట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే నూతన డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు
★ త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్
కొత్తగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను రెండు మూడురోజుల్లో పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనున్నది. అయితే, ఈసారి టెట్ లేకుండానే డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. తాజా సమాచారం ప్రకారం ఈ పోస్టులలో
★ ఖాళీల వివరాలు
- 6,500కు పైగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులున్నాయి.
- స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులు 2,600,
- పండిట్ పోస్టులు 700,
- పీఈటీలు 190 పోస్టులున్నట్టు తెలిసింది